Thursday, April 3, 2025

అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్..

మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం గత కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను డోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు డోర్నకల్ పోలీసులు చాక చక్యంగా ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. మీరు వద్ద నుండి సుమారు 8,30,000 విలువగల బంగారం వెండి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై పిడి యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. వీరిలో షేక్ మొహుద్దిద్దీన్, అడప ఆనంద్ కుమార్ తో పాటు గుర్రం దుర్గ అనే మహిళను అరెస్టు చేసినట్లు తెలిపారు. షేక్ మొహిద్దిన్ ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా.గుర్రం దుర్గ విజయవాడ,అడప ఆనంద్ కుమార్ హైదరాబాద్. షేక్ మొహిద్దిన్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పలు జిల్లాలలో సుమారు 30 పైగా దొంగతనాలకు సంబంధించి పలు కేసులలో ముద్దాయి. ఈ ముగ్గురు దగ్గర నుండి 16 తులాల బంగారు వస్తువులు ఇరవై తులాల వెండి మూడు సెల్ ఫోన్లు రికవరీ చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles