ఉపాధిహామీ పనికి వెళ్లి మహిళకు పాముకాటు.
తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని ఉపాధి హామీ పని కోసం ఎల్లమ్మ గుట్టకు కందకాలు తవ్వుతూ ఉన్నప్పుడు ఎరుకలి యాదమ్మ (43) అనే మహిళ పాము కాటుకు గురైంది. వెంటనే స్పందించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బీర్కూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది. అయితే పరిస్థితి విషమించడంతో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ సూచన మేరకు మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.