గుత్తి కోయ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మెగా ఉచిత వైద్య శిబిరం..
పస్రా : పి ఎస్ ఆర్ గార్డెన్ నందు జిల్లా పోలీసుచే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ములుగు సబ్ డివిజన్ నందు గల అన్ని ఆదివాసి గ్రామాల నుండి 700 మందికి పైగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానీకి ముఖ్య అతిథిగా వీచ్చేసిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గారు ప్రారంభించారు. అతిధులు గా ములుగు OSD GAUSH ALAM IPS , ములుగు ASP SUDHIR R KEKAN IPS పాల్గొన్నారు ఇందులో అన్ని విభాగలలో నిపుణులైన వైద్య బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా SP గారు మాట్లాడుతూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ –అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న గుత్తి కోయ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగినదన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులైన వైద్యులకు శాలువాతో సత్కారించి అభినందనలు తెలిపారు. OSD గారు మాట్లాడుతూ వైద్యం మెడిసిన్స్ తో పాటు మాస్క్స్,మఫ్లర్స్, సోప్స్, టూత్ పేస్ట్, బ్రష్ తో కూడిన కిట్ అందించడం జరుగుతుంద్దన్నారు.ఈ కార్యక్రమంలో DR. మధు PHC పస్రా,DR. సుకుమార్ PHC గోవిందరావుపేట CI, SI పస్రా వెంకటాపూర్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.