Thursday, April 3, 2025

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అసలు రంగు బయటపడింది. ప్రజాసంఘాలు..

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూర్ గ్రామానికి చెందిన మాచర్ల రమేష్ (BC పద్మశాలి) ఘట్కేసర్ ప్రాంతంలో తాను ప్రేమించి పెళ్లి చేస్తుకున్న భార్య సుశ్రుత (మాదిగ), కన్న బిడ్డ దేవర్ష్ ( 4 నెలలపసిబాబు)లను 2019 సంవత్సరం జనవరిలో కాల్చి బూడిద చేసిన కులోన్మాద హత్య చేసిన మాచర్ల రమేష్ , హత్యకు కుట్ర పన్నిన మాచర్ల పుల్లయ్య లు నిందితులు. ఈ దారుణం జరగడానికి ప్రధాన కారకుడు TRS నాయకుడు, మాజీ సర్పంచ్, మాచర్ల పుల్లయ్య . పుల్లయ్య వెనుక, అండగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఉన్నాడని లోకం కోడై కూసింది. ఆ అపవాదు నుండి తప్పించుకోవడానికి తాత్కాలికంగా పుల్లయ్య ను TRS నుండి తోలగించామని ప్రకటించారు. కానీ అదంత ఒట్టి బూటకం, నాటకం అని మొన్న ఈ మధ్యన ఎర్రబెల్లి పుల్లయ్యను ఆయన ఇంటి దగ్గర కలవడాన్ని బట్టి తేలిపోయింది. అన్నారు, మంత్రిగా ఉండి దళిత బాధితుల వైపు ఉండకపోయినా, తాను ప్రమాణం చేసిన చట్టం, న్యాయం వైపైనా ఉండాలి. కానీ మంత్రి గారు నిర్లజ్యగా, బరితెగించి హత్యకేసులో ముద్దాయి అయిన పుల్లయ్య వైపు ఉంటూ ఆయనను శిక్షల నుండి తప్పించడానికి పూనుకున్నాడని అర్ధమయింది. కావున మేము దళిత ప్రజాసంఘల నుండి ఎర్రబెల్లిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒక వేళ పుల్లయ్య శిక్షల నుండి తప్పించుకుంటే దానికి పూర్తి బాధ్యత మంత్రి ఎర్రబెల్లిదే, కాకుండా కెసిఆర్ ప్రభుత్వ బాధ్యత అవుతుందని ప్రజలు, ప్రజా స్వామిక వాదులు గుర్తించాలన్నారు. మంత్రి ఎర్రవల్లి దయాకర్ గారికి చిత్తశుద్ధి ఉంటే “సుశ్రుత దేవర్ష్” “స్మారక శృతి వనం” నిర్మించడానికి స్థలం కేటాయించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. సుశ్రుత తల్లి కందిక కోమల,
కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ గురుమిళ్ల రాజు, కో కన్వీనర్ జె.చక్రవర్తి , బహుజన కులాల ఐక్యవేదిక నాయకులు గుమ్మడి రాజుల సాంబయ్య , సావిత్రి బాయిపూలే మహిళ సంఘం నాయకులు కర్ణేకంటి రాణి, వరంగల్, హన్మకొండ జిల్లా కన్వీనర్లు మంతెన రమేష్ , తంపుల మొగిలి , ద్రావిడ బహుజన సమితి జిల్లా ఉపాధ్యాక్షులు బొట్టు శ్రీధర్, బి ఎస్ పి పాలకుర్తి నియోజకవర్గ నాయకులు పడమంటి భాస్కర్, తెలంగాణ సామాజిక ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు ప్రియా, టిడిపి ఎస్సీ సెల్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ గణపురం ఎల్లయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సుశ్రుత దేవర్ష్ ల సమాధి స్థలం గూడూరులో నివాళులర్పించడం జరిగింది.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles