Thursday, April 3, 2025

వికలాంగులకు వికలాంగుల బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి..

మహబూబాబాద్ జిల్లా/కురవి/ పి సి .డబ్ల్యూ న్యూస్: కురవిలో మండల వికలాంగులకు వికలాంగుల బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని. కురవి మండల కేంద్రంలో బస్టాండు నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి, ఎమ్మార్వో ఆఫీస్ ముందు సుమారు ఒక గంటసేపు వరకు ధర్నా చేసి, కురవి ఎమ్మార్వో ఇమ్మానుయేలు కి వినతి పత్రం అందజేసిన. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) కురవి మండల కమిటీ. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా మాట్లాడుతూ. సంక్షేమ పథకాల్లో వికలాంగులకు వాట కేటాయించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అంత్యోదయ కార్డులు, కొత్త రేషన్ కార్డులతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, వికలాంగుల హక్కులను చట్టాలకు అనుగుణంగా అమలు చేయాలి. వికలాంగులు ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వివక్షతకు గురవుతున్నారు.5శాతం రిజర్వేషన్లు అన్ని రంగాల్లో అమలు చేయాలి. చట్టాలు ఉన్నాయి అమలు చేసే విధంగా స్థానిక సంస్థలపై చర్యలు తీసుకొని వారికే తోడ్పడాలి అని అన్నారు. వికలాంగులను హింసించిన తిట్టిన దూషించిన సెక్షన్ 92 ప్రకారంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రభుత్వాన్ని కోరారు. 200 యూనిట్ల కరెంటును ప్రతి వికలాంగుల కుటుంబానికి ఉచితంగా ఇవ్వాలి,అంత్యోదయ కార్డు కలిగిన వారికే చెక్కర పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.పి. ఆర్.డి మండల అధ్యక్షురాలు రడం గౌరమ్మ,తుడుం ప్రశాంత్, నీలం నరేష్, తుడుం సుజాత, కొండ బత్తుల అరవింద్, ముత్తినేని సీతారామయ్య, కర్నాటి మల్లికార్జున్, దుస్స వీరభద్రం, షేక్ నజీర్, నర్ర పద్మ, ఇర్రి యాకయ్య, ఆన్నెం సుమలత, కొమరే ఉప్పలయ్య, ఎన్ మణెమ్మ, కందిపాటి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles