Thursday, April 3, 2025

BC. GIRLS హాస్టల్ విద్యార్థులను పట్టించుకోని వార్డెన్ ని సస్పెండ్ చేయాలి..

పరకాల పట్టణంలోని స్థానిక SMS BC బాలికల వసతి గృహాన్ని సందర్శించిన MSF నాయకులు ఇందులో భాగంగా ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులు బొజ్జ హేమంత్ మాట్లాడుతు హాస్టల్ విద్యార్థులను వార్డెన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు నిన్న రాత్రి ఒక విద్యార్థిని కడుపునొప్పి గురైంది వార్డెన్ గారు కనీస బాధ్యత లేకుండా ఆ విద్యార్థిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా కేవలం విద్యార్థులను పంపించింది విద్యార్థులు రాత్రి తొమ్మిది గంటల సమయంలో రోడ్డుపై ఉన్నారు ఇదేంటని ఈరోజు ఉదయం హాస్టల్ కి వెళ్లి విద్యార్థులను అడిగి తెలుసుకోగా వార్డెన్ మేడం  మమ్మల్ని పట్టించుకోవడం లేదని హాస్టల్లో పలు సమస్యల గురించి చెప్పారు భోజనం నాణ్యతగా ఉండడం లేదని సరైన సమయానికి భోజనాలు అందడం లేదని, బాత్రూమ్స్ మరియు రూమ్స్ సరిగ్గా లేవని వారు భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులు వార్డెన్ కి పలుసార్లు చెప్పిన పట్టించుకోకుండా విద్యార్థులని బెదిరింపులకు గురి చేస్తూ ఎవరికీ చెప్పుకోకుండా ఇబ్బందులు చేస్తుందని విద్యార్థులు చెప్పారు కాబట్టి ఉన్నత అధికారులు స్పందించి వెంటనే హాస్టల్ వార్డెన్ నీ సస్పెండ్ చేయాలని ఎమ్మెస్ఎఫ్ మండల అధ్యక్షులు బొజ్జ హేమంత్  హెచ్చరిస్తూ అన్నారు. కార్యక్రమంలో కోగిల ప్రేమ్ మండల కార్యదర్శి, ఒంటేరు వరుణ్ పట్టణ కార్యదర్శి, ధైనంపెళ్లి అజయ , వినయ్, సనత్, విద్యార్థినిలు తేజస్విని, హిమబిందు, సౌమ్య, గంగోత్రి, రవళి, సౌజన్య, రాజేశ్వరి, పావని, రిషిత పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles