Thursday, April 3, 2025

ప్రపంచ నిమోనియా డే..

ములుగు జిల్లా పి సి డబ్ల్యూ ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ నిమోనియా డే సందర్భంగా ఐదు సంవత్సరముల లోపు పిల్లలలో వచ్చే నిమోనియా జబ్బు పై అవగాహన కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య గారి అధ్యక్షతన జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ములుగు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విపిన్, ఏటూరు నాగారం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ క్రాంతి కుమార్, డాక్టర్ భవ్య వెంకటాపూర్ ములుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, జిల్లాకు సంబంధించిన డెమో తిరుపతయ్య, సిహెచ్ఓ దుర్గారావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెంకటాపురం ములుగు వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ఇండియా ద్వారా లభించిన సమాచారం మేరకు గణాంకాల రిపోర్టు ప్రకారము ఐదు సంవత్సరముల లోపు పిల్లల్లో మరణాలు, 1000 జననాలకు 32 గా ఉంది. దీనిని 1000 జననాలకు 23 కు తగ్గించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క లక్షం. ఐదు సంవత్సరంల లోపు పిల్లలు నిమోనియా వ్యాధితో అనగా శ్వాస కోశ వ్యాధితో వెయ్యికి ముగ్గురు మరణిస్తున్నారు. దీనిని అరికట్టుటకై పిల్లలను శ్వాస వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని త్వరగా గుర్తించడము మరియు వారికి వెంటనే చికిత్స సదుపాయంలను ఏర్పాటు చేయడము ద్వారానే సాధ్యమవుతుంది. దీనికై ఏఎన్ఎంలు ఆశాలు గృహ సందర్శన నిర్వహించి గుర్తించాలని వెంటనే సేవలందించాలని తెలిపారు. దీనికై లైన్ డిపార్ట్మెంట్ అందరూ ఐసిడిఎస్ ,అంగన్వాడీ కార్యకర్తలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అందరూ సహకారం అందించాలని వారు తెలిపారు. తల్లిదండ్రులకు టీకాల కార్యక్రమంలో నిమోనియా టీకా పి సి వి పిల్లలకు ఆరువారాలకు మొదటి డోసు, 14 వారాలకు రెండవ డోసు, 9 నెలలకు మూడవ డోసు తప్పనిసరి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైన వారిని గుర్తించి, దగ్గరలోని జిల్లాలో నిమోనియా సెంటర్లు అయినా జిల్లా ఆసుపత్రి ములుగు, కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏటూరు నాగారంకు గాని పంపవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు .ఐదు సంవత్సరాలలో పిల్లల్లో అధికంగా ఆరోగ్య సమస్య నిమోనియాతో ఎదురవుతుందని దానిపట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. ఆశాలు గృహ సందర్శన చేసినప్పుడు చిన్న పిల్లలను శ్వాసకోశ వ్యాధులు ఉన్న పిల్లలను గుర్తించాలని వారిని దగ్గరలోని రిఫరల్ సెంటర్కు తరలించాలని కోరారు. అనంతరము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెంకటాపూర్ నుండి నిమోనియా పై అవగాహన ర్యాలీ తీయడం జరిగింది.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles