PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

మళ్లీ పురివిప్పిన ర్యాగింగ్ భూతం. రూమ్‌లో బంధించి మరీ..

హైదరాబాద్‌ ర్యాగింగ్ భూతం మరోసారి పురివిప్పింది. కొందరు సీనియర్లు ఒక జూనియర్‌ని రూమ్‌లో బంధించి చితకబాదారు. ముఖంపై పౌడర్ చల్లి మరీ తీవ్రంగా కొట్టారు. తనని కొట్టొద్దని మొరపెట్టుకుంటున్నా.. కనికరం చూపించకుండా వాళ్లు పిడిగుద్దులు గుద్దుతూ గాయపరిచారు. ఆ తర్వాత.. మరో వర్గం వారు దాడి చేసిన విద్యార్థులపై ఎటాక్ చేశారు. ఇది చినికి చినికి గాలివానగా మారడంతో.. వ్యవహారంతో పోలీస్ స్టేషన్‌దాకా చేరుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని ఓ కాలేజీలో ఈ ఘటన వెలుగు చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ కాలేజీలో ర్యాగింగ్‌లో భాగంగా కొందరు సీనియర్లు హద్దుమీరారు. ఒక జూనియర్‌ని ఆట పట్టించాలనుకొని, అతనిపై దాడికి దిగారు. రూమ్‌లోకి తీసుకెళ్లి, ముఖంపై పౌడర్ చల్లి.. విచక్షణారహితంగా కొట్టారు. తమకు ఎదురు చెప్పాడని.. కోపంతో ఆ సీనియర్లు రెచ్చిపోయారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన విద్యార్థి.. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో భయబ్రాంతులకు గురైన ఆ విద్యార్థి తల్లిదండ్రులు.. వెంటనే క్యాంపస్‌కు చేరుకొని, తమ పిల్లాడిని తీసుకెళ్లారు. దాడి చేసిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇంత దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడుతుంటే.. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆ విద్యార్థిపై దాడి చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు ట్విటర్‌లో మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి.. ఆ సీనియర్లకు తగిన బుద్ధి చెప్పాలని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా తనకు ఫిర్యాదు అందడంతో.. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు కేటీఆర్ సూచించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం.. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల్ని సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. కాగా.. ఓ కాలేజీలో ఎప్పట్నుంచో ర్యాగింగ్ జరుగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.