కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
పార్టీ కోసం పనిచేస్తూ అకాల మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఎల్లప్పుడూ ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన తెరాస నాయకులు పెండేల అన్వేష్ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది.పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరు చేయించిన రూ.2 లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు హన్మకొండలోని వారి నివాసంలో అన్వేష్ కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తున్న కార్యకర్తలు అకాల మరణ చెందితే ఆ కుటుంబం ఆర్ధిక పరమైన ఇబ్బందులకు గురికాకూదనే కేసీఆర్ గారు సభ్యత్వం ద్వారా రెండు లక్షల ప్రమాద భీమా చేపించడం జరిగిందన్నారు.అదేవిధంగా పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తక్కళ్లపల్లి స్వర్ణలత జీవన్,వైస్ ఎంపిపి & మాదాల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి సాంబరెడ్డి,సర్పంచ్ వెలగందుల కృష్ణ,గ్రామ అధ్యక్షులు రాంగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.