పరకాలలో భయపెడుతున్న వీధి కుక్కలు ,కోతులు పంటలను ధ్వంసం చేస్తున్న ఊర పందులు నివారణ చర్యలపై అధికారుల నిర్లక్ష్యం ఇబ్బందులు పడుతున్న పరకాల ప్రజలు పరకాల పట్టణంలో వీధి కుక్కలు. కోతులు జనాలను భయపెడుతున్నాయి, రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుక్కలు కోతుల దాడిలో పలువురికి గాయాలైన ఘటనలు ఉన్నాయని చెబుతున్నారు, దీంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు ,ఒకవైపు రైతుల పంటలను పందులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్న అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇంకోవైపు పరకాల ప్రజలను కుక్కలు కోతుల బెడద వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు .పరకాల లోని పలు వీధులలో వీధి కుక్కలతో జనం భయంతో వణికి పోతున్నారు, రాత్రి వేళలో ఒంటరిగా బయటకు రావాలంటే కుక్కలు మీదికి రావడంతో జనాలు పరుగులు తీస్తున్నారు ,ఒంటరిగా కనిపిస్తున్న వ్యక్తులపై కోతులు మంద దాడి చేయడంతో పలువురికి గాయాలైనట్లు చెబుతున్నారు. కోతులు ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తూ నానా హంగామా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు .మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో కోతులు, కుక్కల బెడదతో చిన్నపిల్లలు సైతం బయట తిరగలేకపోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .సంబంధిత అధికారులు పట్టించుకోని ప్రజలకు ప్రాణాలు కాపాడాలని కుక్కలు పందులు కోతుల బెడద నుండి ప్రజలను రక్షించాలని స్థానికులు వేడుకుంటున్నారు.