మోర్తాడ్ లో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..
పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి షేక్ హుస్సేన్: బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలోని శుక్రవారం రోజున మోర్తాడ్ మండల కార్యాలయం ఆవరణలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మోర్తాడ్ మండల కేంద్రంలోని 11 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆడపడుచులకు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమం నిర్వహించారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను మోర్తాడ్ ఎం.పీ.పీ. శివలింగు శ్రీనివాస్. జడ్పిటిసి బద్దం రవి. మోర్తాడ్ సర్పంచ్ భోగా ధరణి ఆనంద్.మోర్తాడ్ మండల టి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా. కో ఆప్షన్ మెంబర్ అహ్మద్ ఇంతియాజ్. పి.ఏ.సి. ఎస్. చైర్మన్ కళ్ళెం అశోక్. మోర్తాడ్ ఎం.ఆర్.ఓ. బావయ్య. డిప్యూటీ ఎమ్మార్వో సుజాత. చేతులు మీదుగా 13 మంది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి బద్దం రవి మాట్లాడుతూ. ఒక్కొక్క లబ్ధిదారునికి రూ. ఒక్క లక్ష ఒక్క వంద 16 రూపాయల చొప్పున చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదెంటి ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశం పెట్టారని వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేద కుటుంబాల కోసం కేసీఆర్ ఒక తోబుట్టువుగా ఉంటారని ప్రతి ఒక్క ఆడపడుచులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. లబ్ధిదారులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.