విజ్ఞానముతోమూఢనమ్మకాలు అంతం, మానవ విలువలు కాపాడుదాం భారత ఆర్థిక సమాజ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్..
పి.సి.డబ్ల్యూ న్యూస్ జగిత్యాల జిల్లా వెల్గటూర్ ప్రతినిధి: విజ్ఞానంతో మూఢనమ్మకాలు అంతం,మానవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్
వెల్గటూర్ మండలం కుమ్మరి పల్లి ప్రభుత్వ మేడల్ పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు పురుషులు సమానమని ఆలోచనతో ముందుకు సాగుతూ మూఢనమ్మకాలు వీడనాడుతూ ఉన్నత చదువులతో ఉపాధ్యాయులకు తల్లి దండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ సూచించారు. అన్ని రంగాల్లో ఎదుగుతూ ఆత్మగౌరవంతో జీవించాలని ఆయన అన్నారు. ఇంద్రజాల ప్రదర్శకులు నరేష్ విద్యార్థులకు మంత్రాలు మహిమలు దయ్యాలు భూతాలు బూటకమని దొంగ స్వాములు నమ్మి మోసపోవద్దని విద్యార్థులకు మూఢనమ్మకాలపై ఇంద్రజాల నరేష్ చేసిన ప్రదర్శన కత్తిని కడుపులోకి దించుకోవడం, నీటిలో రంగులు సృష్టించడం, ఇసుక నుండి కాయిన్స్ తీయడం, నోట్లొ మంటలు లేపడం, విద్యార్థి చేతిపై కిరోసిన్ తో కాల్చడం, ఇనుప చువ్వ నాలుకకు గుచ్చుకోవడం, వేపాకులపై నీటితో మంటలు లేపడం, ఉరితాడు మాయం చేయడం, లాంటి అనేక ప్రదర్శనలు విద్యార్థులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇంచార్జి దీకొండ మహేందర్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.