ఘనంగా అబుల్ కలాం ఆజాద్ 134వ జయంతి ఉత్సవం..
ములుగు జిల్లా పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ కనబరుస్తూ అబుల్ కలం ఆజాద్ లా ఎదగాలని మండల విద్యాధికారి ఎం. శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జాతీయ విద్యా దినోత్సవం,మైనారిటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల దేవగిరిపణ్నంలో ప్రిన్సిపాల్ శ్రీమతి అతియా సుల్తానా అధ్యక్షతన అబుల్ కలాం ఆజాద్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి ఏం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి భారతరత్న అబుల్ కలాం ఆజాద్ 134వ జయంతిని పురస్కరించుకొని మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ వెల్ఫేర్ రాష్ట్ర జిల్లా సెక్రెటరీ ఎండి సర్వర్ పాషా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. మైనార్టీ పాఠశాల ఉపాధ్యాయురాలను సిబ్బందిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.