Wednesday, November 25, 2026

పైడిపల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల నిఘా. ఏడుగురు పట్టివేత.. రూ.1,00,500 నగదు స్వాధీనం

పరకాల మండలం పైడిపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పరకాల పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,00,500 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్న వారిపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Related Articles

Latest Articles