హనుమకొండ నగరంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శనివారం టి యు డబ్ల్యూ జే ఐ జేయు జిల్లా మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మహాసభ అనంతరం జిల్లా యూనియన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల లో భాగంగా హనుమకొండ జిల్లా జనం సాక్షి బ్యూరో చీప్ గడ్డం బాలరాజు జిల్లా జాయింట్ సెక్రెటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పలువురు జర్నలిస్టులు అధికారులు ప్రజా ప్రతినిధులు నూతనంగా ఎన్నుకోబడిన గడ్డం బాలరాజు కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన జర్నలిస్టు మిత్రులందరికీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
