పరకాల పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై పవన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుపై ఉన్న షాపుల ముందు అనధికారంగా నిల్వ ఉంచిన పైపులు, ఇతర సామాగ్రి, నేమ్ ప్లేట్లను తొలగించారు. రోడ్డు విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంచిన వస్తువులు వలన ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆక్రమణలు చేయవద్దని షాపు యజమానులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
