పరకాల: రైతుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారంపై పోరాటానికి సంకేతంగా నిర్వహిస్తున్న మహత్తర రైతు సంగ్రామ సదస్సుకు పరకాల పట్టణం నుంచి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. బుధవారం ఉదయం పరకాల పశువుల సంత ప్రాంగణం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బయలుదేరి వరంగల్ నగరంలోని గ్రీన్‌వుడ్ హైస్కూల్ గ్రౌండ్, హంటర్ రోడ్‌కు చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం బిఆర్ఎస్ ఎప్పటికప్పుడు పోరాడుతుందని తెలిపారు. ఈ సదస్సులో రైతుల సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు పాల్గొననుండటం వల్ల కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఆయన ప్రసంగం ద్వారా రైతులకు దిశానిర్దేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరకాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం సదస్సుకు మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. పార్టీ పటిష్టతను చాటుతూ, రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని బిఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు.
