పరకాల, మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పరకాల విద్యుత్ కార్యాలయం ఆవరణలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఈ డి. రాజు హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కార్మికుల సేవలు సమాజ నిర్మాణంలో కీలకమని, వారి కృషి వలననే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇంజినీర్ ఆర్. శ్రీనివాస్, సిబ్బంది సభ్యులు మార్క్ పరమేశ్, దుర్గాసింగ్, ఎఫ్‌ఎమ్ సోమేశ్వర్, ఎల్‌ఎమ్ ఖాదర్, ఎల్‌ఎమ్ రాజేందర్, ఎల్‌ఎమ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఎల్‌ఎమ్‌లు మరియు అవుట్‌సోర్సింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం సందర్భంగా కార్మికుల హక్కులు, సంక్షేమంపై అవగాహన కల్పిస్తూ, ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
