Saturday, June 6, 2026

పోచారం గ్రామంలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

పరకాల మండలం పోచారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్, ఆర్‌ఐ, గ్రామ సర్పంచ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతలను తెలుసుకుని సమాజ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలను పాటించడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొంటాయని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలు ఐక్యంగా ఉండి పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Related Articles

Latest Articles