Saturday, June 6, 2026

కామారెడ్డిపల్లిలో జాగృతి పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

పరకాల, రూరల్ ఏప్రిల్ 27 (పిసిడబ్ల్యూ న్యూస్):వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కామారెడ్డిపల్లి గ్రామంలో జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో యువత గంజాయి, డ్రగ్స్, గుట్క వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. గంజాయి అమ్మకం లేదా వినియోగంపై సమాచారం ఉంటే 8712584473 నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. అలాగే చదువు ప్రాధాన్యం, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాలు, బాల కార్మికుల సమస్యలు, డయల్ 100 సేవలు, సీసీటీవీ కెమెరాల అవసరం, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ వంటి అంశాలపై పాటలు మరియు నాటికల ద్వారా ప్రజలకు వివరణ ఇచ్చారు. మూఢనమ్మకాలపై మ్యాజిక్ షో ద్వారా అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు మరియు బెట్టింగ్ యాప్స్‌పై ప్రత్యేక నాటిక ప్రదర్శిస్తూ, సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎస్‌ఐ ఎం. రమేష్ , గ్రామ సర్పంచ్ , పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్, కళాబృందం సభ్యులు, హెడ్ కానిస్టేబుల్స్ విలియమ్, వెంకటేశ్వర్లు, రత్నయ్య, పీసీ పూల్ సింగ్, హోంగార్డ్స్ శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన సుమారు 250 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Related Articles

Latest Articles