హనుమకొండ: హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించగా, కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. JNS Stadiumలో నిర్వహించిన నూతన కమిటీ ఏర్పాటు సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, హనుమకొండ జిల్లా క్రీడా అధికారి, సంస్థ పరిశీలకుడు మరియు రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అబ్జర్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఏర్పడిన ఈ కమిటీ 2026 నుండి 2030 వరకు నాలుగు సంవత్సరాల పాటు పదవీకాలాన్ని నిర్వహించనుంది. హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా బొచ్చు రాకేష్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు అబ్జర్వర్లు బొచ్చు రాకేష్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
