Saturday, June 6, 2026

అన్న కొడుకు ఆస్తి కాజేసిన రిపోర్టర్..? పరకాలలో కలకలం

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణానికి చెందిన ఒక ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌పై ఆస్తి వివాదం సంబంధించి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినట్లు ప్రచారం ఉన్న ఈ రిపోర్టర్, తన సొంత అన్న కొడుకు ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకుని ప్రస్తుతం అనుభవిస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉందని బాధితుడు తెలిపారు. తాను ఎదుర్కొన్న అన్యాయంపై పూర్తి ఆధారాలతో త్వరలో పరకాల ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా, ఈ ఘటనపై సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. న్యాయం కోసం తాను చివరి వరకు పోరాడతానని బాధితుడు తన ప్రకటనలో స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles