పరకాల, మార్చి 29 (పిసిడబ్ల్యూ న్యూస్): రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ ప్రచారం పరకాలలో కొనసాగుతోంది. మూడో దశలో ఐదో రోజు కార్యక్రమంగా ఆదివారం రాజిపేటలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలపై పోలీసులు కట్టడి చర్యలు చేపట్టారు. వాహనదారులను ఆపి ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు తప్పవని, కుటుంబాలకు అనర్థాలు కలుగుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్ల చేత వాహనాలు నడపనివ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి, సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని పోలీసులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఎం. రమేష్ తో పాటు కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.
