Saturday, March 7, 2026

శాయంపేట: ప్రజలకు మరింత చేరువగా, బాధితులకు సత్వర న్యాయం అందించే దిశగా తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు వేగవంతం చేసింది. పౌర కేంద్రిత సేవల భాగంగా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మల్కపేట్ గ్రామానికి వెళ్లి బాధితుడి ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరించారు. ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నంబర్ 22/2026గా నమోదు చేసి, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు. నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రతిని బాధితుడికి అక్కడికక్కడే అందజేశారు. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఇబ్బంది కలగకుండా, వారి నివాసానికి వెళ్లి ఫిర్యాదులు స్వీకరించడం, వెంటనే కేసులు నమోదు చేసి న్యాయం అందించడం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని ఎస్‌హెచ్‌ఓ ఆత్మకూర్ తెలిపారు.ప్రజలు ధైర్యంగా తమ సమస్యలను పోలీసులకు తెలియజేయాలని, ప్రతి ఫిర్యాదుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles