పరకాల, ఫిబ్రవరి 5 (పిసిడబ్ల్యూ న్యూస్): గురువారం రోజున పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని పరకాల పట్టణ ఆర్.ఎం.పి – పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు దొమ్మటి బాబురావు ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందిస్తున్న ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యుల పాత్రను గుర్తించి, వారి సమస్యలను రాష్ట్ర అసెంబ్లీలో చర్చించవలసిందిగా కోరారు. అలాగే పరకాల పట్టణంలో ఆర్.ఎం.పి – పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్‌కు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా ఒక కమిటీ హాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యులు ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొంటూ, వారి సమస్యలను అసెంబ్లీలో చర్చించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కమిటీ హాలు మంజూరుకు సంబంధించి అవసరమైన అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామని తెలిపారు. ఎమ్మెల్యే స్పందనకు అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.పి – పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
