పరకాల పట్టణం మున్సిపాలిటీ 20వ వార్డులో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకున్నా రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను… గెలుపు నాదే అంటూ సుల్తాన్ రాజేష్ ధీమా వ్యక్తం చేశారు. 20వ వార్డు ప్రజలు పూర్తిగా నా వెంటే ఉన్నారు అని స్పష్టంగా చెప్పారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాను అని గుర్తు చేశారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధి అంశాల్లో ముందుండి పనిచేశానని పేర్కొన్నారు. టిక్కెట్ రాజకీయాలకన్నా ప్రజల నమ్మకమే నాకు బలం అని రాజేష్ అన్నారు. రెబల్‌గా పోటీ చేసి గెలిచి, అనంతరం మళ్లీ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులు పొందుతాను అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై రాజీపడని పోరాటమే తన లక్ష్యమని, వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శక పాలన తన ప్రాధాన్యతలని తెలిపారు. 20వ వార్డులో ఇంటింటి ప్రచారంలో సుల్తాన్ రాజేష్‌కు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన గమనార్హమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. టిక్కెట్‌కు అతీతంగా ప్రజాబలం ఉంటే విజయం ఖాయం అనే నినాదంతో రాజేష్ ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామంతో పరకాల మున్సిపల్ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.
