Saturday, March 7, 2026

పరకాల పట్టణంలో బీ–ఫామ్ రాజకీయాలపై ప్రజల తీవ్ర ఆగ్రహం..

పరకాల పట్టణంలో మొత్తం 22 వార్డులు ఉన్నప్పటికీ, ప్రతి వార్డులో కొద్ది మంది మాత్రమే కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది పెద్దలకు బీ–ఫామ్ కోసం భారీగా డబ్బులు ఇచ్చినట్లు వస్తున్న సమాచారం పట్టణ ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది.డబ్బులు ఇచ్చిన వారికే బీ–ఫామ్ ఎందుకు? ప్రజల్లో నిరంతరం ఉంటూ, సమస్యలపై పోరాడుతూ, సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన వారికి బీ–ఫామ్ ఇవ్వకుండా, డబ్బు పలికిన వారికే అవకాశం కల్పించడం ఎంతవరకు న్యాయం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది. అలాంటి ఎన్నికల్లో డబ్బు పాత్ర పెరిగితే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల నమ్మకాన్ని కొనలేము, సేవతోనే సంపాదించాలి అని పలువురు స్పష్టం చేస్తున్నారు. ప్రజల కష్టసుఖాల్లో నిలిచిన, వార్డు అభివృద్ధి కోసం నిజంగా పని చేసిన వ్యక్తులకే బీ–ఫామ్ ఇవ్వాలని, డబ్బు రాజకీయాలకు పార్టీ పెద్దలు తక్షణమే చెక్ పెట్టాలని పరకాల పట్టణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles