Saturday, March 7, 2026

పరకాల పట్టణ ప్రజల తీర్పు స్పష్టం – డబ్బులతో ఓట్లు కొనలేరు!

పరకాల పట్టణంలో మొత్తం 22 వార్డులు ఉండగా, ‘పైసలు, మందులు ఇస్తే ఓట్లు పడతాయి’ అనే ప్రచారం పచ్చి అబద్ధమని పట్టణ ప్రజలు తేల్చిచెప్పారు. ఓటరు ఆత్మగౌరవాన్ని తక్కువగా అంచనా వేయడం మానుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అమ్మకానికి కాదు.. ఆలోచనకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ,  డబ్బులు, మద్యం పంచకుండా నిజాయితీగా పోటీ చేసి గెలవాలి. డబ్బుల బలంతో కాదు, ప్రజల నమ్మకంతోనే విజయం సాధించాలి” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరకాల ప్రజలు ఇప్పుడు అభివృద్ధి, పారదర్శకత, సేవా దృక్పథం ఉన్న నాయకత్వానికే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని స్పష్టమవుతోంది.డబ్బులతో కాదు.. ప్రజలతోనే రాజకీయాలు చేయాలన్న సందేశాన్ని పరకాల ప్రజలు గట్టిగా వినిపిస్తున్నారు.

Related Articles

Latest Articles