Saturday, March 7, 2026

పరకాల మున్సిపాలిటీలో నామినేషన్ల జోరు..

పరకాల పట్టణ మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డులకు గాను నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగింది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మొత్తం 215 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రతి వార్డులో పోటీ తీవ్రంగా నెలకొనగా, పలువురు అభ్యర్థులు స్వతంత్రులుగా కూడా బరిలోకి దిగారు. పట్టణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి అనుచరులతో సందడి నెలకొంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించారు. ఇక ఉపసంహరణల అనంతరం అసలైన ఎన్నికల పోటీ ఎలా ఉండబోతుందన్నది పట్టణ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related Articles

Latest Articles