Saturday, June 6, 2026

పరకాల మున్సిపల్ 11వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మార్త విక్రమ్ నామినేషన్

పరకాల పట్టణ మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిగా మార్త విక్రమ్ శుక్రవారం రోజున అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదాలతో కారు 🚗 గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డులో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ, మౌలిక వసతుల అభివృద్ధి, శుభ్రత, తాగునీరు, రోడ్లు, కాలనీల సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని మద్దతు తెలిపారు.

 

Related Articles

Latest Articles