Wednesday, July 22, 2026

పరకాల పట్టణం 9 వార్డ్ కౌన్సిలర్ గా బత్తుల మల్లేశం నామినేషన్..

పరకాల పట్టణ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, ఇందులో భాగంగా 9వ వార్డులో పద్మశాలి కులానికి చెందిన పరకాల స్థానికుడు బత్తుల మల్లేశం ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్‌గా తన నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన మల్లేశం, నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా 2005 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే కొండా సురేఖ హయాంలో మాదారం శివారులోని గుమస్త సంఘాలకు సంబంధించిన భూ సమస్యపై కీలకంగా పోరాటం చేశారు. అప్పటి కలెక్టర్ కారుకు అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేస్తూ, 9వ వార్డు కాలనీవాసులకు దాదాపు 121 ఫ్లాట్లు, సుమారు 120 గజాల స్థలాన్ని ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఉద్యమం ద్వారా అనేక పేద కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేశారు. అప్పటి నుంచీ నేటి వరకు పరకాల పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సేవ చేయడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మల్లేశం తెలిపారు. 9వ వార్డులో దాదాపు 90 శాతం మంది తన రక్త బంధువులేనని, వారిని ఎప్పటికీ మరచిపోనని పేర్కొన్నారు. తనను గెలిపించి పద్మశాలీల సత్తాను చాటాలని ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా 9వ వార్డులోని అన్ని కులాలు, వర్గాల ప్రజలను సమానంగా దగ్గర తీసుకొని, ప్రతి సమస్యలోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని బత్తుల మల్లేశం స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles