Wednesday, July 22, 2026

బిఆర్ఎస్ లో చేరిన దుబాసి వెంకటస్వామి..

పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు దుబాసి వెంకటస్వామి  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) లో చేరడం జరిగింది.
వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన బొచ్చు సతీష్, దండ్ర వెంకట్, ఒంటేరు బాబురావు, కోగిల సుధాకర్ తదితరులు కూడా బిఆర్ఎస్ లో చేరారు. చేరిన వారందరికీ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి  మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడిచిన కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిందని, అందుకే నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. పరకాల నియోజకవర్గంలో బిఆర్ఎస్ మరింత బలపడుతుందని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles