Saturday, March 7, 2026

ఉదయ్‌పూర్‌లో పరకాల యువకుడికి కాంస్య పతకం

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: ఉదయ్‌పూర్‌లో ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండియా ఫైర్ సర్వీస్ కంట్రోల్ బోర్డు మీట్–2026లో హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన పోతరాజు అశోక్ కాంస్య పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. 5 కిలోమీటర్ల పరుగుపందెం విభాగంలో దేశవ్యాప్తంగా పాల్గొన్న పోటీదారులతో పోటీపడి అశోక్ ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం మట్టేవాడ ఫైర్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన కఠోర సాధన, క్రమశిక్షణకు ఈ విజయం నిదర్శనమని పలువురు ప్రశంసించారు. అశోక్ సాధించిన ఈ విజయంతో నాగారం గ్రామంతో పాటు పరకాల ప్రాంతంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యువత క్రీడల్లో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆయన విజయం ప్రేరణగా నిలుస్తుందని గ్రామస్తులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

Related Articles

Latest Articles