Saturday, March 7, 2026

పీలేరు డిపోలో డి.ఎం. ఆధ్వర్యంలో గేట్ మీటింగ్

ఆంధ్రప్రదేశ్ పీలేరు డిపోలో డిపో మేనేజర్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పీలేరు డిపో సాధించిన ఆదాయ ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి ప్రత్యేక రవాణా ఏర్పాట్లలో భాగంగా పీలేరు డిపో OR : 113 నమోదు చేయగా, డిపోకు రూ.23 లక్షల ఆదాయం వచ్చినట్లు డి.ఎం. వెల్లడించారు. ఈ విజయంలో డిపోలోని డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది, సాంకేతిక సిబ్బంది సమిష్టి కృషి కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. పండుగ రద్దీ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించిన ప్రతి ఉద్యోగి అంకితభావం ప్రశంసనీయం అని తెలిపారు. కష్టపడి పని చేసిన ఉద్యోగులందరికీ డి.ఎం. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాగే భవిష్యత్తులో కూడా డిపో అభివృద్ధి, ఆదాయ వృద్ధి కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles