పరకాల, జనవరి16 (పిసిడబ్ల్యూ న్యూస్):పరకాల బస్టాండ్ ప్రధాన కూడలిలో గుర్తు తెలియని వ్యక్తి దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డుపై పడిఉండటంతో అక్కడ సంచలనం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన ఒక సామాజిక కార్యకర్త వెంటనే 108 ఎంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, కేవలం ఐదు నిమిషాల్లో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అందించి ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.వేగంగా స్పందించిన 108 సిబ్బంది సేవలను అక్కడి వ్యాపారులు, స్థానికులు అభినందించారు.
