పరకాల పురపాలక ఎన్నికల సన్నహక సమావేశంలో భాగంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల మున్సిపాలిటీ 2వ వార్డు ఎన్నికల ఇంచార్జి కట్కురి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.
పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ మరి ముఖ్యంగా ఎమ్మెల్యే కి ఉన్నటువంటి ముందు చూపుతో ప్రణాళిక బద్ధంగా వార్డ్ డెవలప్మెంట్ విషయంలో సూచనతో ఆలోచనలకు అనుగుణంగా2వ వార్డు కౌన్సిలర్ గా పార్టీ అధిష్టానం ఎవరికీ కేటాయించిన అభ్యర్థి గెలిపించుటలో ముఖ్యంగా కార్యకర్తలందరూ ఏకతాటిపై నడిచి అభివృద్ధి పథంలో మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గెలిపించుకోనుటలో అందరం భాగస్వాములు కావాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీర్మానాలు అభివృద్ధి కోసం కోరుకోవడం జరిగింది.ఇప్పుడు జరగబోయే పరకాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయుటలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందు ఉంటారని ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ ముందుకు సాగుతామని ఒక్కొక్కరి అభిప్రాయాలు వెల్లడించారు.ఎన్నికలలో కొంత ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళుటకు పలువురు సూచనలు చేశారు అలాగే 30 మంది ఒక్క ఇంచార్జి లను, కుల సంఘాల పరంగా లిస్ట్ తయారు చేయడం, పాటు లోకల్ నాన్ లోకల్ లిస్టులు తయారు చేయడం. ఓటర్లను ప్రభావితం చేసే నాయకుల లిస్టు తయారు చేయడం మొదలగు వాటిని ప్రణాళిక బద్ధంగా చేయుటకు నిర్ణయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిధి సీనియర్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మహిళలు నాయకులు, కార్యకర్తలు పెద్ద మనుషులు పాల్గొనడం జరిగింది.
పరకాల మున్సిపాలిటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..రెండో వార్డు ఇంఛార్జి కట్కూరి దేవేందర్ రెడ్డి
