Wednesday, July 22, 2026

పిసిడబ్ల్యూ న్యూస్ 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన పరకాల ఎమ్మెల్యే..

హనుమకొండ, జనవరి 08 (పిసిడబ్ల్యూ న్యూస్): పిసిడబ్ల్యూ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా, తెలుగు దినపత్రిక రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హనుమకొండలోని వారి నివాసంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పిసిడబ్ల్యూ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా అందిస్తున్న వార్తా సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా పిసిడబ్ల్యూ న్యూస్ ప్రసారాలు విస్తరించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ దిశగా మీడియా యజమాన్యం చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోదరామకృష్ణ, కట్కూరి దేవేందర్ రెడ్డి, కుంకుమేశ్వర దేవాలయ చైర్మన్. జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles