Wednesday, July 22, 2026

నూతన గ్రంథాలయం ఏర్పాటు చేయాలి.

జిల్లా గ్రంథాలయం చైర్మన్ కోటరాజు బాబు కి వినతి పత్రం అందజేత.

చిట్యాల జనవరి 7 (పిసి డబ్ల్యూ న్యూస్)

చిట్యాల మండల కేంద్రంలోని గ్రంథాలయమును జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ కోటరాజు బాబు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది. గ్రంథాలయంలో వసతులు, పాఠ్యపుస్తకాలు ,దినపత్రికలు పాఠకులకు కావలసిన పుస్తకాలు మరియు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా గ్రంథాలయ భవనం లేక గ్రామపంచాయతీలో నడుస్తున్నందున వెంటనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో పక్కా భవన నిర్మాణాన్ని త్వరలో చేపడుతామని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, గౌడ సంఘం మండల అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, గ్రామపంచాయతీ నాలుగో వార్డ్ మెంబర్ తవుటం నవీన్, గ్రామ ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles