Saturday, March 7, 2026

జాతీయ సదస్సు కరపత్రం ఆవిష్కరణ..

పరకాల, జనవరి 07 (పిసిడబ్ల్యూ న్యూస్):పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ సదస్సు కరపత్రాన్ని బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం ఆవిష్కరించారు. ఈ నెల 23న సదస్సును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. బేటి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ సదస్సు ప్రధాన అంశం ఆధునిక ప్రపంచంలో పర్యావరణ సుస్థిరతకు సంబంధించి పలు కొత్త పోకడలు (novel trends) మరియు సవాళ్లు (challenges) ప్రాముఖ్యత’పై కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులకు వివరించినట్లు తెలిపారు. విద్యా రంగంలో నూతన ధోరణులను అధ్యయనం చేయడమే సదస్సు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డా. ఎ. శ్రీనివాస్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. టి. భీంరావు, కళాశాల స్టాఫ్ సెక్రటరీ డా. ఎలిశాల అశోక్, ఐక్యుఏసీ కో–ఆర్డినేటర్ డా. జి. రామకృష్ణ, రాజనీతి శాస్త్ర విభాగ అధ్యాపకులు డా. ఆడెపు రమేష్ పాల్గొన్నారు.

Related Articles

Latest Articles