Saturday, March 7, 2026

మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం. మహిళల కోసం మహిళలతో ఏర్పడినది పరకాల ఇందిరా మహిళా డైరీ

హనుమకొండ, జనవరి 06 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ చీఫ్ ప్రమోటర్ల సమావేశాన్ని నిర్వహించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
మంగళవారం హనుమకొండ భవాని నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు డిఆర్ డి ఏ అధికారులు మరియు పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తి తరల సహకార సమాఖ్య లిమిటెడ్ చీఫ్ ప్రమోటర్ల తో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…మహిళలు అంటే ఆత్మవిశ్వాసానికి,నమ్మకానికి ప్రతిరూపమని అన్నారు. మనందరికీ భయం బాధ్యత ఉంటేనే ముందుకు వెళ్తామన్నారు.పరకాల ఇందిరా మహిళా డైరీకి ప్రస్తుతం10వేల మందికి పైన సభ్యత్వం, వాటదనం కట్టి ఉన్నారని అన్నారు.గేదలు లేని వారికి సబ్సిడీతో లోన్లు, గడ్డి విత్తనాలు ఇప్పిస్తామని, మందులు, తక్కువ ధరలో దాన, గేదెల పెంపకం, డైరీ నిర్వహణ తదితర సౌకర్యాలను ఇప్పిస్తామన్నారు.వెటర్నరీ వైద్యుల సేవలు ప్రతి గ్రామంలో ఉండేలా చర్యలు చేపడతామన్నారు.ముల్కనూరు డైరీ కి సంబంధించిన వారితో శిక్షణ ఇప్పిస్తామని, పశువులకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. 70 సంవత్సరాల లోపు మహిళలు సభ్యత్వం తీసుకోవడానికి అర్హులని తెలిపారు. చిన్న రైతులు, చిన్న కుటుంబాలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పరకాల ఇందిరా మహిళా డైరీ కృషి చేస్తుందని అన్నారు. మొత్తం డైరీ పరిధిలో 58 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఉన్నాయని అన్నాడు. డైరీ కి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేసి త్వరలోకి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Related Articles

Latest Articles