పరకాల, డిసెంబర్ 01 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల మండలం
సోమవారం రోజు నాగారం క్లస్టర్ పరిధిలోని నాగారం, పైడిపల్లి, మల్లక్ పేట్ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆయన సూచనలు, సలహాలు అందించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పైడిపల్లి గ్రామానికి చెందిన పసుల బిక్షపతి బీజేపీ తరఫున సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు బీజేపీ నేతలు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, జయంత్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
పైడిపల్లి సర్పంచ్ గా నామినేషన్ వేసిన పసుల బిక్షపతి..
