Saturday, March 7, 2026

పవిత్రమైన దర్గా, ఆషుర్ ఖానా, ఖబ్రస్థాన్ అక్రమంగా కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

కొడంగల్, సెప్టెంబర్ 26 (పిసిడబ్ల్యూ న్యూస్): కొడంగల్ లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పవిత్రమైన దర్గా, ఆషుర్ ఖానా, ఖబ్రస్థాన్ అక్రమంగా కూల్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అట్టి పవిత్రమైన కట్టడాలను కూల్చివేత సంఘటనపై విచారణ జరిపించి కూల్చివేతకు బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ మరియు ప్రాంతీయ శాఖ అధికారిపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్. తాజొ ద్దీన్ మాట్లాడుతూ కొడంగల్లో సంబంధిత ముస్లిం సామాజిక వర్గ కమిటీలు మరియు స్థానిక ముస్లిం పెద్దలకు సమాచారం ఇవ్వకుండా తేదీ 20- 9- 2025 శనివారం అర్ధరాత్రి వేళ ఇట్టి కట్టడాలను కూల్చివేయడం మతసామరస్యానికి విఘాతం కలిగిస్తుంది. పవిత్రమైన ఇట్టి కట్టడాల అక్రమ కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తక్షణమే స్పందించి విచారణ జరిపించి పవిత్రమైన ఆ కట్టడాలను కూల్చివేసిన అధికారులపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని, అలాగే తిరిగి అట్టి పవిత్ర కట్టడాలను పునర్నిర్మించాలని ఈ సందర్భంగా తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది.

Related Articles

Latest Articles