పరకాల, జూన్ 22 (పి సి డబ్ల్యూ న్యూస్) పరకాల మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు లో గత కొంతకాలంగా పనిచేయకుండా ఉన్న బోర్వెల్ ను, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొచ్చు జెమిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, సిబ్బందితో బోరింగ్ ను రిపేర్ చేయించారు. కాలనీ వాసులకు బోర్వెల్ అందుబాటులోకి రావడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
