రామడుగు, మార్చి 3 ( పిసిడబ్ల్యూ న్యూస్): హైదరాబాదు స్వచ్ఛంద సంస్థ చూపు లేని (బ్లైండ్ పీపుల్ ) వారితో మన శ్రీ ప్రగతి పాఠశాలలో ఫిబ్రవరి 18 th నాడు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో వారు పిల్లలకు మోటివేషన్ తో పాటు అన్ని రకాల పాటలతోఅందరినిఆకట్టుకున్నారు.వారిప్రదర్శన,మాటలు,పాటలు విన్నాకవారికి ఏదో విధంగా సహాయం చేయాలని శ్రీ ప్రగతి పాఠశాలలోని విద్యార్థులందరూ తమ వంతుగా ₹ 92,334/- జమ చేసి వారికి ఈరోజు 3rd march ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి ₹300 ఆ పైన డబ్బులు ఇచ్చిన95మందివిద్యార్థులకుసంస్థ తరఫున ఒక సర్టిఫికెట్, పెన్ను మరియు మెడల్ ప్రజెంట్ చేయడం జరిగింది.స్కూల్ మొత్తంలో ముచ్చర్ల రిషికేష్ ₹1400 ముచ్చర్ల మనుప్రకాష్ ₹1300 , పెండ్ల సాత్విక్ రామ్₹1000 ఇచ్చారు. వారికి శిల్డ్స్ అందించారు.ఇంతటి ఉదారతను చాటుకున్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు అభినందించారు.