కురవి మార్చి 01(పిసిడబ్ల్యూ న్యూస్): మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం సంగెం వెంకన్న ఇటీవల మరణించగా వారి దశదినకర్మలను దగ్గరుండి అందరికీ భోజనం వడ్డించిన కురవి ఎస్ఐ గండ్రతి సతీష్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 25 కేజీల బియ్యం,2000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా తన వంతుగా సాయం చేస్తానని ఎస్సై సతీష్ హామీ ఇచ్చారు.గ్రామవాసి మెంతుల లక్ష్మీ తిరుమల్ 25 కేజీల బియ్యానికి 1500 రూపాయలు ఆర్థిక సాయం చేశారు.అదేవిధంగా ఆ కుటుంబానికి గ్రామస్తులు ఎవరి తోచిన విధంగా తమ వంతు ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది.సంగెం వెంకన్న కుటుంబం గ్రామస్తులకు, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.