పరకాల: బుదవారం రాత్రి పరకాల పట్టణ కేంద్రంలో గల శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులతో కలసి వీక్షించారు ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ మహాశివరాత్రిని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. ప్రజలందరిపై ఆ మహాదేవుని కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. సమస్త భక్త జనకోటికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.