వరంగల్, ఫిబ్రవరి 1 (పిసిడబ్ల్యూ న్యూస్): వాసవి క్లబ్ కేసీజీఫ్ డాక్టర్స్, వరంగల్ 2025 నూతన కార్యవర్గం 31-01-2025 న ఐ ఎం ఎ హాల్ లో పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులు గా డా వెనిశెట్టి ప్రవీణ్ కుమార్, సెక్రటరీ గా డా శివ్వా సృజన్, కోశాధికారి గా డా ఎస్.అవనీష్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా డా ఎన్. ఆశా దీప్తి, డా ముక్క దిలీప్, జాయింట్ సెక్రటరీగా డా. రవీందర్, డా. అంచురి కార్తీక్ లు ఎన్నుకోబడ్డారు. గత సంవత్సరం లో వాసవి క్లబ్ కేసీజీఫ్ వరంగల్ అధ్యక్షులుగా సేవలు అందించిన డా వి. నరేష్ కుమార్ ఉండి రూ. 2. 20 లక్షల విలువైన సుమారు 20 సేవ కార్యక్రమాలు నిర్వహించి నందుకు గాను వారిని జోన్ చైర్మన్ గా పదోన్నతి ఇచ్చినట్టు వరంగల్ జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ వి.కిషోర్ కుమార్ తెలియ చేశారు. నూతనంగా కొలువుదీరిన కార్యవర్గం 8 బీద కుటుంబాలకు కుట్టు మెషిన్, పిండి మిల్లు, నిత్యావసర సామాన్లు సుమారు రూ. 40వేల విలువైన సేవ కార్యక్రమాలు నిర్వహించి వారి దాతృత్వం చాటుకున్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహణ నియమాల మేరకు ఈ సంవత్సరం మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు డా ప్రవీణ్ కుమార్ నేతృత్వం లోని కార్యవర్గం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గార్లపాటి సంతోష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా వేమిశెట్టి కిషోర్ కుమార్ డిస్టిక్ వి 101ఎ, గవర్నర్ ప్రత్యేక అతిథిగా డా. ముక్క దిలీప్ కుమార్, తానా -వరంగల్ ప్రెసిడెంట్, మంచాల విజయ్ కుమార్, క్యాబినెట్ సెక్రటరీ అడ్మిన్ పబ్బతి నాగభూషణం క్యాబినెట్ సెక్రటరీ సర్వీసెస్, మాదంశెట్టి సంపతి క్యాబినెట్ కోశాధికారి, గోపరపు రమ ఉపేందర్ వైస్ గవర్నర్, విడియాల నూథన్ కుమార్, వైస్ గవర్నర్,ఇండక్షన్ అధికారి విఎన్ ప్రతిభ సంకల్ప కేసిజిఎఫ్ పుల్లూరి శ్రీధర్, రీజియన్ చైర్మన్ గౌరవ అతిథులుగా డాక్టర్ కె. నాగార్జున రెడ్డి ఐఎంఏ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, విఎన్ కేసిజిఎఫ్ డాక్టర్ పి. సుధీర్ కుమార్ వ్యవస్థాపక అధ్యక్షులు, విఎన్ కేసిజిఎఫ్ డా. సోమ శ్రీధర్ రీజియన్ కో-ఆర్డినేటర్, డా. వల్లాల పృథ్వీరాజ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్, నవ నిర్మాణ కోచ్, వల్లాల శైలజ, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ లు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.