సంగెం, జనవరి 30 (పిసిడబ్ల్యూ న్యూస్): 420 రోజుల కాంగ్రెస్ పాలనపై 420 మోసాలపై మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందచేత..మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా సంగెం మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి.. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాలమేరకు ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించి..ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించి..ఈ చేతకాని కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి ప్రసాదించి…ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలని మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందచేసారు.