మొగుళ్లపల్లి, జనవరి 21 (పిసిడబ్ల్యూ న్యూస్): మొగుళ్ళపల్లి మండలంలోని ఇసిపేట గ్రామం లో గీతా కార్మికుడు గాజుల మొగిలి (49) కల్లు గీస్తుండగా.. చెట్టుపైనే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కులవృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. దిగే క్రమంలో మధ్యలో గుండెపోటు రావడంతో చెట్టుపైనే కుప్పకూలారు. తోటి గీతా కార్మికులు గుర్తించి, క్రిందికి దించి హాస్పటల్ కు తరలించిన అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న గాజుల మొగిలి కుటుంబానికి న్యాయం చేయాలని గీతా కార్మికులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.