బయ్యారం, జనవరి18(పి సి డబ్ల్యూ న్యూస్): నేరగాళ్లు బ్యాంకు లావా దేవీలను చోరీ చేసే ప్రమాదం ఉందని, వారిపట్ల బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిఐ రవికుమార్, ఎస్సై తిరుపతి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో బ్యాంకు మేనేజర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బ్యాంకు వినియోగదారుల ఖాతాలు సైబర్ నేరగాళ్ల చోరీ చేసే ప్రమాదం ఉందని, వినియోగదారుల వ్యక్తిగత అకౌంట్ల నెంబర్ లు ఇతరులకు వ్యక్తులకు చెప్పవద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా బ్యాంకు సిబ్బంది వినియోగదారులకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బ్యాంకు మేనేజర్ లు ఉన్నారు.